Tuesday, May 7, 2024
- Advertisement -

కేసీఆర్ వర్సెస్ గవర్నర్

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నానాటికీ అంతరం పెరుగుతోందా? గవర్నర్ వైఖరిపై ప్రభుత్వం గుర్రుగా ఉందా ? ప్రతి అంశంలో గవర్నర్ జోక్యం ఎక్కువ అవుతున్నదని ప్రభుత్వం భావిస్తోందా? ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే మనకు అదే అర్థమవుతోంది.

పరేడ్ గ్రౌండ్ లో జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను కరోనా పేరుతో రాజ్ భవన్ కు మార్చడం, అక్కడికి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు కానీ ఎవరూ వెళ్లకపోవడంతో విభేదాలు ఒక్క సారిగా బహిర్గతం అయ్యాయి. దీంతో గవర్నర్ పై ప్రభుత్వం బహిరంగంగానే నిరసన తెలిపినట్టు అయింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేయగా చాలా కాలం వరకు గరర్నర్ దానికి ఆమోదం తెలుపలేదు. చాలా కాలం వరకు గవర్నర్ ఆఫైల్ ను పెండింగ్ లో పెట్టారు. ఆ తర్వాత స్పీకర్ మధు సూదనాచారి ఫైలును కూడా చాలా కాలం పెండింగ్ లో ఉంచారు. ఇటీవల రాజ్ భవన్ లో గవర్నర్ ఫిర్యాదుల బాక్సును ఏర్పాటు చేశారు. దీనిని విరమించుకోవాలని ప్రభుత్వం కోరినా ఆమె వినలేదు. ఈ వరుస పరిణామాలతోనే ప్రభుత్వం , గవర్నర్ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. కాగా మునుముందు ఈ విభేదాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.

రౌడీ హీరోకు బంపర్ ఆఫర్

జోరుమీదున్న రంగ‌మ్మ‌త్త‌

సినీ అభిమానుల‌కు గుడ్ న్యూస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -