Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు పోరాటకాన్ని ఆయన కేబినెట్ మంత్రులే ఉతికి ఆరేశారా?

- Advertisement -

తనంతోటు లేడని తన గురించి తానే డప్పేసుకోవడం మొదలెట్టినప్పటి నుంచీ రోజు రోజుకూ మరుగుజ్జు నాయకుడు అయిపోతున్నాడు చంద్రబాబు. ఇప్పటికే బాబు ఎన్నికల హామీలు అమలు చేయడం అసాధ్యం అని 2014ఎన్నికలకు ముందే చెప్పినప్పటి నుంచీ చంద్రబాబుపై జగన్ తెలివితేటలే పైచేయి సాధిస్తున్నాయి. ఇక హోదా బెస్ట్ అని జగన్ అంటే చంద్రబాబేమో ఎంచక్కా ప్యాకేజ్ కేక అన్నాడు. చేతులు కాలాక ఇప్పుడిక ఆకుల పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అవిశ్వాసంతో సహా అన్ని విషయాల్లోనూ జగన్‌ని అనుసరించాల్సిన దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.

ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని అనుసరిస్తున్నందుకే సగం సిగ్గుతో బాధపడుతున్న చంద్రబాబుపై తాజాగా ఆయన సహచర మంత్రులే విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీ నేను ఏదేదో చేశానని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి చంద్రబాబు కేబినెట్ మీటింగ్ అరేంజ్ చేస్తే…..బాబు చెప్పే రెగ్యులర్ సోది వినడానికి అస్సలు ఆసక్తి చూపించని చంద్రబాబు కేబినెట్ సహచరులు రివర్స్‌లో చంద్రబాబునే విమర్శలతో ఉతికి ఆరేశారు. విభజన హామీల అమలు కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలన్న చంద్రబాబు డిమాండ్ ఎంత పెద్ద తప్పో……చంద్రబాబు డిమాండ్ చేసినట్టుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి కేంద్రం ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోతుందో దిమ్మతిరిగే స్థాయిలో చంద్రబాబుకు వివరించారు ఆయన కేబినెట్ సహచరులు. మరీ ముఖ్యంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే చంద్రబాబుకు పూర్తిగా తలంటేశాడట. ఇప్పటికే నాలుగేళ్ళు పూర్తయ్యాయి. ఇప్పుడిక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే ఈ ఎన్నికల ఏడాది కూడా గడిచిపోతుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వచ్చేదెవరో ఎవరికి తెలుసు? ఆ వచ్చిన వాళ్ళు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్‌ని ఎందుకు అమలు చేస్తారు? ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయిందని …..ఇకపై కూడా ఇలాంటి కమిటీల డిమాండ్స్‌తో కేంద్రానికి 2019 ఎన్నికల వరకూ టైం పాస్ చేసే తరహా సలహాలు అస్సలు ఇవ్వొద్దని చంద్రబాబుకు కాస్త ఘాటుగానే సూచనలు చేశారు ఆయన కేబినెట్ సహచరులు. అసలే 2019 ఎన్నికల్లో టిడిపికి ఓటమి ఖాయం అన్న సర్వే రిపోర్ట్స్ నేపథ్యంలో తెలిసీ తెలియకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి లాంటి డిమాండ్స్‌ని చంద్రబాబు కేంద్రం ముందు ఉంచుతూ ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మరి కాస్త ఆగ్రహం పెరిగేలా చేయడం ఖాయమని బాబు సహచర నాయకులే భయపడుతున్నారు. ఆ భయంతోనే తెలివితక్కువగా జేపీసీ వేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్ ఎంత పెద్ద తప్పో ప్రపంచానికి పాఠాలు చెప్పాను అని చెప్పుకునే బాబుకు వివరించారట కేబినెట్ మంత్రులు.

ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్ అయింది. అనుభవం అనుభవం అని చెప్పుకోవడం తప్పితే విభజన నాటి నుంచీ నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాబు అనుభవం, తెలివితేటలు ఉపయోగపడింది ఎప్పుడూ లేదని ఢిల్లీ స్థాయి జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకూ జగన్‌ని అనుసరించి చులకన అయిపోయిన చంద్రబాబు……ఇప్పుడు ఆయన కేబినెట్ సహచరుల స్థాయి తెలివితేటలు కూడా లేని నాయకుడిగా ముద్ర వేయించుకునే స్థాయికి దిగజారాడని కామెంట్స్ పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -