Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబుకు సవాల్ విసిరన మంత్రి అనిల్ కుమార్..

- Advertisement -

పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ సక్సెస్ కావడంతో టీడీపీ నేతలు తమ అక్కసును జగన్ పై వెల్లగక్కుతున్నారు. రెండు రోజులుగా ప్రభుత్వంపై దుస్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ తిప్పికొట్టారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 780 కోట్లు మిగిలిందని తెలిపారు.

వరదల కారణంగా పోలవరం పనులు నిలిచిపోయాయని నవంబర్ నుంచి డిజైన్ ప్రకారమే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ చేపట్టామని ఆయన చెప్పుకొచ్చారు. రూ. 4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్‌ రూ. 4,359 కోట్లకు వచ్చిందని అనిల్ వివరించారు. గతంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడిపోతాయోనని పచ్చనేతలు భయపడుతున్నారని అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అప్పుడు బాబు పార్టీని మూసివేస్తారా లేకా రాజకీయ సన్యాసం తీసుకుంటారని ప్రశ్నించారు.టీడీపీ వెనకేసుకొస్తున్న నవయుగ కంపెనీ రివర్స్ టెండరింగ్‌లో ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూడా త్వరలోనే రివర్స్ టెండరింగ్ చేస్తామని అన్నారు.దేవినేని కూర్చుని మాట్లాడిన స్థలం కూడా ఇరిగేషన్‌ శాఖదే అని మంత్రి అనిల్ అన్నారు. ఏడాదికి రూ. వెయ్యి లీజ్‌తో ఉంటూ నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము రివర్స్ టెండరింగ్‌కు వెళ్లకపోతే… ఆ డబ్బు టీడీపీ జేబులోకి వెళ్లేదని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -