Monday, April 29, 2024
- Advertisement -

టీపీసీసీ చీఫ్‌ ఫిక్స్‌.. రాష్ట్ర పగ్గాలు ఆ నేతకే

- Advertisement -

కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. బంతి అధిష్టానం కోర్టుకు చేరడంతో సీన్‌ ఢిల్లీకి మారుతోంది. పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడం… సీనియర్లు,జూనియర్లు అన్న స్పష్టమైన గీత కనిపిస్తుండటంతో అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. తొలి నుంచి పార్టీనే నమ్ముకుని ఎదిగొచ్చిన నేతలకు అవకాశం ఇవ్వాలా.. లేక ప్రస్తుత పరిస్థితుల్లో జనం మూడ్‌కి తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలా అన్నది హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే 160 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపించినప్పటికీ… ఎటూ తేల్చలేకనే అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపికను జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పటికే ఖరారైపోయిందని… పార్టీలో సీనియర్లను కన్విన్స్ చేసేందుకే అధిష్టానం కాస్త సమయం తీసుకుంటోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో రెండు వర్గాలు
పీసీసీ అధ్యక్ష వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ రెండు గ్రూపులుగా చీలిపోయిందని పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పార్టీకి సేవ చేస్తున్న వారినే ఈ పదవికి ఎంపిక చేయాలని కొందరు, పార్టీకి ఊపు తెచ్చే స్పీడున్న నాయకుడికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. పాతకాపులకే పగ్గాలు ఇవ్వాలని కోరుతున్న నాయకులు అసలు అభిప్రాయ సేకరణే సరిగా జరగలేదని అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కోర్‌ కమిటీ సభ్యుల నుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా మొత్తం 160 మందిని పిలవడం ఏఐసీసీ నియమావళికి విరుద్ధమని వారంటున్నారు. ఈ మేరకు సోనియా, రాహుల్‌లకు ఫిర్యాదు కూడా చేశారు.

రేవంత్‌ చేతికి రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు..!
అయితే, పార్టీని ఉత్తేజపరిచే నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం బావిస్తోందట. అందుకే తెలంగాణ పగ్గాలను ఎంపీ రేవంత్ రెడ్డికి అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం డిసైడ్‌ అయిందట. ముందుగా లీకులు ఇచ్చి… సీనియర్లు కన్విన్స్‌ అయ్యేందుకు కాస్త టైమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అధిష్టానం పీసీసీ ప్రకటనను ఆలస్యం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీలోలాబీయింగ్ మొదలుపెట్టిన కొమటిరెడ్డి
పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి పేరు ఖరారైనట్లు లీకులు అందడటంతో రేసులో ఉన్న కోమటిరెడ్డి వెకంట్‌రెడ్డి హుటా హుటిన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు పదవుల కంటే పార్టీనే ముఖ్యమని చెప్పారు. దీన్ని బట్టి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ఎన్నిక ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో మరికొద్ది రోజుల్లో తెలుస్తోంది. ఇక కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -