Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్ర‌బాబుపై ఫైర్ అయిన భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు

- Advertisement -

టీడీపీ,భాజాపాల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటన నేప‌థ్యంలో మ‌రింత మాట‌ల వేడి రాసుకుంది. అసలు ప్రధాని నరేంద్ర మోదీని ఏపీలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు ఎవరని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

పోలవరం ఓ జాతీయ ప్రాజెక్టు అనీ, ఇది పీపీఏ పర్యవేక్షణలో సాగాలని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అప్పనంగా అప్పగించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. అసలు చంద్రబాబు ఓ వ్యాపారస్తుడనీ, నేత కాదని దుయ్యబట్టారు.

పోలవరం ప్రాజెక్టులో ఎంతో అవినీతికి జరిగిందన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రాజెక్టు వద్ద ఫోజులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు ఏనాడు మాట్లాడలేదని ఆరోపించారు. రాష్ట్ర విభజనలో డబుల్ గేమ్ ఆడిన చంద్రబాబు ఆ తర్వాత పోలవరం విషయంపై నోరెత్త లేదన్నారు.

1995లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2004 వరకు అంటే తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు పోలవరంపై మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్మున్న, ధైర్యం ఉన్న నాయకుడు అంటూ కొనియాడారు. పనిని చేతల్లో చూపే వ్యక్తి కాబట్టే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రూ.10వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని తీర్మానించారని తెలిపారు.

వైఎస్ మరణానంతరం ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను రద్దు చేసి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి కట్టబెట్టారన్నారు. అనంత‌రం రూ.16,000 కోట్లుగా ఉన్న పోలవరం వ్యయాన్ని గత రెండేళ్లలో ఏకంగా రూ.52,000 కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నా ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిచేయడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా, పురోగతి చూపకుండా ఉంటే కొత్తగా నిధులను కేంద్రం ఎందుకు విడుదల చేస్తుందని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. నితిన్ గడ్కరీ రెండుసార్లు ప్రాజెక్టు పరిశీలించారని విశాఖపట్నంలో రివ్యూలు నిర్వహించినట్లు గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -