Sunday, April 28, 2024
- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ కి షాక్.. ఈసీ మూడేళ్ల నిషేధం

- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఆయన ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకుంది.

ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. బలరాం నాయక్ 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

అంతే కాదు మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.

‘మా’ఎన్నికల బ‌రిలో నటి హేమ..

పెళ్లి చేసుకున్న రెండు నెలలకు భార్య హిజ్రా అని తెలిసి భర్త షాక్!

విశ్వాసం లో కూతురు సెంటిమెంట్.. వలిమై లో మదర్ సెంటిమెంట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -