Wednesday, May 1, 2024
- Advertisement -

కేసీఆర్ ముందస్తు వ్యూహానికి బీజేపీ ఝలక్

- Advertisement -

టీఆర్ఎస్ పని అయిపోయింది. కేసీఆర్ ముందస్తు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బీజేపీ నేతలను నమ్మి ముందస్తురాగం తీసినందుకు చావుదెబ్బ తిన్నట్టే. ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా టీడీపీ శక్తులన్నీ కూడగట్టుకుని ఎన్నికలకు సిద్ధమయ్యేలోపు తాను విజయకేతనం ఎగురేసేయాలని భావించాడు. ముందుగానే ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా ఇతర కమలనాథులతో అంతా మాట్లాడుకుని, గవర్నర్ ద్వారా కొంత రాయబారం నడిపి, అంతా సెట్ చేసుకుని మరీ ముందస్తుకు వెళ్లాడు. ఎన్నికల తేదీలపై ఎంత పక్కా సమాచారం, కాన్ఫిడెన్స్ లేకపోతే అక్టోబర్ లో నోటిఫికేషన్, నవంబర్ లో ఎన్నికలు, డిసెంబర్ లో ఫలితాలు అని ముందే చెబుతాడు. అయితే కేసీఆర్ ముందస్తు ఆలోచనకు ఊతమిచ్చి, ప్రోత్సహించిన బీజేపీ నేతలు ఇప్పుడు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ససేమిరా అంటున్నారు. ఏదో ఒక వంకతో, ఏదో ఒక కారణాన్ని చూపించి, ఎన్నికలను వాయిదా వేయించాలని ఆయన భావిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు కాకుండా, వచ్చే ఏప్రిల్, లేదా మేలో జరగనున్న సాధారణ ఎన్నికలతో పాటే జరిపించాలని పట్టుబడుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో అమిత్ షా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

తెలంగాణా ఇచ్చినందుకు కుటుంబసమేతంగా సోనియాకు పాదాభివందనాలు చేసేసి, ఆ వెంటనే ఆమెను దారుణంగా మోసం చేసిన కేసిఆర్ మనల్ని మోసం చేయకుండా ఉంటాడా ? అని అమిత్ షా ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే పోటీ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది . పైగా టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ టీడీపీ పొత్తు అన్నీ కాంగ్రెస్ కే కలిసివస్తాయి. బీజేపీకి నామమాత్రపు సీట్లు కూడా రావు. అని షా తేల్చి చెప్పారు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గితే దాని ప్రభావం దేశమంతా పడుతుంది .మొన్న కర్నాటకలో అధిక సీట్లు వచ్చి కూడా మనం చేతులెత్తేశాం. మనం చేసిన రాజకీయాలను దేశమంతా దుమ్మెత్తి పోసింది. విపరీతమైన నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో అలాంటి పనులు ఏమీ చేయలేం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక దక్షిణాదితో దండయాత్ర మొదలైందని విపక్షాలు విరుచుకుపడతాయి. పార్లమెంట్ ఎన్నికలపై దాని ప్రభావం గట్టిగా పడుతుందని అమిత్ షా తన వాదనను గట్టిగానే వినిపించారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు మోడీ ప్రభావంతో కొన్ని సీట్లు అయినా గెలవొచ్చు. అప్పుడు ముక్కోణపు పోటీ ఉంటుంది, బీజేపీకి లాభం కలిగి, కాంగ్రెస్ దెబ్బతినే అవకాశాలున్నాయి. అంతేకానీ నమ్మదగ్గ వ్యక్తికాని కేసీఆర్ కోసం ముందస్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు జరగటానికి ఇంకా తొమ్మిది నెలల గడువుంది. ఈ తొమ్మిది నెలలు గవర్నర్ ద్వారా మనమే పాలించి పరిపూర్ణానందస్వామిని తెలంగాణాలో బలమైన నాయకుడుగా తయారు చేయాలి . ఆ దిశగా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి కార్యాచరణ, జరిపినట్లు తెలిపారు. అందులో భాగంంగానే మొన్న బీజేపీ కార్యకర్తలు పరిపూర్ణానందస్వామికి ఘనస్వాగతం పలికినట్లు అమిత్ షా చెప్పారు. ‘తెలంగాణాలో అధికారం’ పేరుతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో ఈ అంశాలపై అమిత్ షా ప్రెజెంటేషన్ సమర్పించినట్లు తెలిసింది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -