Monday, April 29, 2024
- Advertisement -

పద్మవ్యూహంలో చిక్కునున్న రేవంత్.. బయటపడేదెప్పుడూ ?

- Advertisement -

గత కొన్నాళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి అధిష్టించిన తరువాత.. పార్టీలో కల్లోలం మొదలైంది. ఒక్కసారిగా సీనియర్ నేతలంతా కూడా తీవ్ర వ్యతిరేకత చూపుతూ వచ్చారు. బయటి నుంచి వచ్చిన వారు అధ్యక్ష పదవి అధిష్టించడం ఏంటని సీనియర్ల అసంతృప్తి అంతా ఇంతా కాదు. ఇక రేవంత్ రెడ్డి కూడా సీనియర్లను బుజ్జగించే ప్రయత్నాలు ఏ దశలోనూ చేయలేదని కాంగ్రెస్ వర్గాల ఇన్ సైడ్ టాక్. పార్టీకి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా నేతలతో ఎలాంటి చర్చలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారని రేవంత్ రెడ్డిపై కొందరు సీనియర్ నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తూ వచ్చారు.

ఇక పార్టీలో మొదలైన ఈ అంతర్గత కల్లోలం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలహీన పడిందని చెప్పక తప్పదు. దీనికి బెస్ట్ ఉదాహరణ ఇటీవల జరిగిన మునుగుడు ఉపఎన్నికలే. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులోనే పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలపడింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందనే విషయం. ఇదిలా ఉండగా పార్టీ విడుతున్న నేతలంతా రేవంత్ రెడ్డిపై నెపం మోపుతూ బయటకు వెళుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్, మర్రి శశిదర్ రెడ్డి వంటి నేతలంతా కూడా రేవంత్ రెడ్డి కరణంగానే పార్టీ విడుతున్నట్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఇక పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డిపై అడపా దడపా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ అన్నట్లుగా సాగుతోంది కాంగ్రెస్ రాజకీయం. ఇక ఇటీవల జరిగిన కమిటీల నియామకంలో సీనియర్లకు అన్యాయం జరిగిందని కొందరు నేతలు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇక ఇదే సమయం అన్నట్లుగా సీనియర్ నేతలంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, జగ్గారెడ్డి, బట్టి విక్రమార్క వంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పై సీనియర్లంతా తురుగుబాటుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు కే‌సి‌ఆర్ లాంటి ఉద్దందుడు.. మరోవైపు కమ్ముకొస్తున్న బీజేపీతో పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డికి సీనియర్ల తిరుగుబాటు కొత్త సమస్యగా మారింది. మరి ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్న రేవంత్ రెడ్డి ఎలా బయటపడతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్.. ఈసారి వినకపోతే అంతే !

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

టార్గెట్ సి‌ఎం పదవి.. బీజేపీ ఓపెన్ ఆఫర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -