భువనేశ్వరీ భహిరంగ లేఖ

- Advertisement -

ఏపీ ప్రజలకు నారా భువనేశ్వరీ భహిరంగ లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అన్యాయం మీ తల్లీ, తోబుట్టువు, కూతురికి జరిగినట్లు స్పందించిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తనకు అండగా ఉన్న టీడీపీ శ్రేణులను జీవితంలో మర్చిపోలేనని భువనేశ్వరీ తెలిపారు. తమను తమ తల్లిదండ్రులు విలువలతో పెంచారని, విలువలతో కూడిన సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరూ వ్యవహరించకూడదని భువనేశ్వరీ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో మరే మహిళపై రాజకీయనాయకులు నీచంగా మాట్లాడకుండా చూడాలన్నారు. ఇతరుల గురించి మాట్లాడటానికి వైసీపీ నాయకులకు నోరు ఎలా వస్తుందని విమర్శించారు. తన భర్త సహనంతో ఉన్నారని, ఆయనకు మీలా రౌడీ ఇజం చేయరాదని భువనేశ్వరీ వైసీపీ నేతలను విమర్శించారు.

- Advertisement -

తాను తన పని తాను చేసుకుపోతున్నానన్న భువనేశ్వరీ.. కొందరు తనను కూడా రాజకీయాల్లోకి లాగి వారిపై వారే విర్శలు గుప్పించుకుటుంన్నారని ఎద్దేవా చేశారు. ప్రతీ ఒక్క రాజకీయనాయకుడు రాజకీయాలతో సంభందంలేని వారిని వ్యక్తిగతంగా దూషించవదని భువనేశ్వరీ విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి ట్వీట్ పై స్పందించిన మంత్రి పేర్నినాని

జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ రెచ్చగోకుతుంది…? ఎందుకు..?

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -