Sunday, April 28, 2024
- Advertisement -

చిరంజీవి ట్వీట్ పై స్పందించిన మంత్రి పేర్నినాని

- Advertisement -

సినిమా అటోగ్రఫ్రీ చట్టానికి ఏపీ ప్రభుత్వం సవరణ చర్యలు చేపట్టింది. ఏపీ సినిమా నియంత్రణ సవరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ప్రేక్షకుడు నష్టపోకుండా ఉండేందుకు కొత్త చట్టం తీసుకొచ్చినట్టు సమాచార శాఖమంత్రి పేర్ని నాని మండలిలో ప్రకటించారు. ఇటీవలి కాలంలో సినిమా నిర్మాతలు వందలాది కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీసి పెట్టుబడి రాబట్టే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ ధరలకు టిక్కెట్లు అమ్ముతున్నారని… దాంతో సగటు అభిమాని నష్టపోయే అవకాశం ఉన్నందున తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తక్కువ సమయంలో అధిక డబ్బులు రాబట్టే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ షోలు నిర్వహించి సినిమా అగోగ్రఫి చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భాలు కూడా ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.

మరోవైపు సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ పరిణామమే అయినా… థియేటర్ల మనుగడతో పాటు సినీ పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాల కోసం టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో చిరంజీవి ట్వీట్ చేశారు.

చిరంజీవి ట్వీట్ కు రాష్ట్రప్రభుత్వం తరపున సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ అంశం సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సిమాటోగ్రఫీ శాఖ సీఎం దగ్గర ఉండటంతో ఆయనే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్ని నాని తెలిపారు.

మొత్తానికి కొత్త బిల్లు సవరణతో ప్రేక్షకులకు పారదర్శకంగా సినిమా టికెట్ అందేలా చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఫిల్మ్ చాంబర్ ఎలా స్పందిస్తుందో తేలాల్సి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ రెచ్చగోకుతుంది…? ఎందుకు..?

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

టాక్ తేడాగా ఉన్నా.. వసూళ్లు 250 కోట్లు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -