Monday, April 29, 2024
- Advertisement -

గుజ‌రాత్‌లో కొత్త నాయ‌కుల‌ ఆవిర్భావం.. భ‌విష్యత్‌లో బీజేపీకి గ‌డ్డుకాల‌మే

- Advertisement -

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినా బీజేపీకి నిరాశే మిగిలింది. ల‌క్ష్యం 150 ఎమ్మెల్యే సీట్లు కాగా కేవ‌లం 99 సీట్ల‌తో స‌రిపెట్టుకుపోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. అందుకే గుజ‌రాత్‌లో బీజేపీ నాయ‌కులు డీలా ప‌డిపోయారు. ఎందుకంటే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్‌లోనే అధికారానికి కావాల్సిన సీట్ల‌కంటే రెండు, మూడు ఎక్కువ సాధించారు. విజ‌య ధుందుభి మోగిస్తామ‌నుకుంటే సాధార‌ణ విజ‌యం ల‌భించ‌డంతో బీజేపీ అధిష్టానం కూడా కొంచెం నిరాశ‌తో ఉంది.

గుజ‌రాత్ ఎన్నిక‌ల‌తో యువ నాయ‌కులు పైకి వ‌చ్చారు. గుజ‌రాత్‌లో పటేళ్లకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని పోరాడుతూ పైకి వ‌చ్చిన నాయ‌కుడు హార్దిక్ ప‌టేల్‌. ఇత‌డు ప‌టేళ్ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కోరుతూ పిలుపునిచ్చిన ఆందోళ‌న‌ల‌కు పటేల్ సామాజిక వ‌ర్గం ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చింది. ఇత‌డి పోరాటంతో గుజ‌రాత్ రాష్ట్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి, కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వానికి వ‌ణుకు పుట్టింద‌. ప్ర‌ధాన నాయ‌కుడిగా హార్దిక్ ప‌టేల్ మార‌డంతో ఈసారి ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని బీజేపీ నిర్ణ‌యించుకుంది. ఈ భ‌యంతో ప్ర‌ధాని మోదీ రంగంలోకి దిగి గుజ‌రాత్‌లో విశేషంగా ప్ర‌చారం చేశాడు. నెల రోజులు కేటాయించారంటే ఎలా ఉందో ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

అత‌డి త‌ర్వాత దళిత నేత జిగ్నేశ్‌ మేవాని ప్ర‌ధాన నాయ‌కుడిగా మారాడు. ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని విమ‌ర్శిస్తుండ‌డంతో అంద‌రీ దృష్టిని ఆక‌ర్షించాడు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో జిగ్నేశ్ కీల‌క పాత్ర పోషించి బీజేపీ ఓట్ల‌ను దెబ్బ‌తీశాడు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో విజయం సాధించాడు. దీంతో ఇప్పుడు జిగ్నేశ్ ప్ర‌ధాన నాయ‌కుడిగా.. బీజేపీ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారాడు. ఇక వీరిద్ద‌రూ ఇటీవ‌ల భేటీ అయ్యారు. హార్దిక్ ప‌టేల్‌, జిగ్నేశ్ స‌మావేశం కావ‌డంతో గుజ‌రాత్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ క‌లిసి ఉండింటే బీజేపీకి క‌చ్చితంగా గెల‌వ‌క‌పోయేది.

భేటీ అనంత‌రం ఇద్ద‌రు నాయ‌కులు మాట్లాడారు. తమ పోరాటం కేవలం దళితులు, పటేళ్ల కోసమే కాకుండా 6.50 కోట్ల గుజరాతీల కోసం ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ అవినీతి రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని హెచ్చరించారు. ప్రధాని మోదీ రాజకీయాల్లో నుంచి తప్పుకునే ఆసన్నం అయిందని, ప్రజలు ఆయన చేసే పనులను సహించే పరిస్థితుల్లో లేరని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -