Tuesday, April 30, 2024
- Advertisement -

అందరూ కుదేలైతే అదాని సంపద ఎలా పెరిగింది? : రాహుల్ గాంధీ

- Advertisement -

గ‌తేడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19).. త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌పంచ దేశాల‌కు వ్యాపించింది. ఈ వైర‌స్ మ‌హమ్మారి పంజా విసురుతూ.. ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించింది. ల‌క్ష‌లాది మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకంది. సామాన్యుల‌లో పాటు బ‌డా వ్యాపారుల‌పై కూడా ఆర్ధిక ప్ర‌భావం ప‌డింది.

అయితే, కోవిడ్‌-19 సృష్టించిన ఆర్థిక సంక్షోభంలో ప్ర‌పంచ కుబేరులు ఎలాన్ మ‌స్క్, జెఫ్ బెజోస్ ల ఆదాయంలో క్షీణ‌త క‌నిపించినా.. భార‌త బ‌డా వ్యాపారుల సంపాద‌న మాత్రం భారీగానే పేరింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భార‌త సంప‌న్నుడు గౌతమ్ అదానీ క‌రోనా సంక్షోభంలోనూ 16.2 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయంతో 2020లో అత్య‌ధిక ఆదాయం ఆర్జించిన వారిలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచారు.

. “2020లో మీరు ఎంత సంపదను పెంచుకోగలిగారు?… అందుకు జవాబు సున్నా అనే చెప్పాలి. మరోవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఇతను మాత్రం తన సంపదను 50 శాతం మేర పెంచుకున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యమైందో నాకు చెప్పగలరా?” అంటూ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, 2021ను ఉటంకిస్తూ వెలువడిన వార్తా కథనాన్ని రాహుల్ తన ట్వీట్‌కు జత చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 2020లో 50 శాతం పెరిగిందని ఈ వార్తా కథనం పేర్కొంది.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !

మెరిసే ముఖ సౌంద‌ర్యం కోసం.. ఈ చిట్కాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -