Saturday, April 27, 2024
- Advertisement -

జమిలి ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

జమిలి ఎన్నికలపై టీపీసీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు పెడితే దేశం రెండుగా విడిపోవడం ఖాయమని, ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని అన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు వస్తే దక్షిణ భారత దేశం నుంచి ఒక్క ఓటు కూడా అవసరం లేకుండానే ఉత్తరాది ఓట్లతో దేశాధ్యక్షుడు ఎన్నికవుతాడని, ఆ తర్వాత అన్ని రకాల వివక్షలూ తెరపైకి వస్తాయన్నారు. జమిలి ఎన్నికల ద్వారా అమెరికా తరహాలో ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకునే పద్ధతిని తీసుకురావాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఒకవేళ దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందని వ్యాఖ్యానించారు.

బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కీలక మంత్రి పదవులన్నీ ఉత్తరాది వారికే కట్టబెట్టారని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని, అలా కాని పక్షంలో ఈ అంశంపై పార్లమెంటులో చర్చ లేవనెత్తుతామని హెచ్చరించారు.

అబద్దాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఒకరికొకరు పోటీ పడతారని, ఈ విషయం ఆ ఇద్దరిని మించినవారు దేశంలోనే లేరని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించడం కొత్తేమీ కదాన్నారు. గతంలో బిహార్‌కు ప్రకటించిన ఐదు లక్షల కోట్ల ఏమైందని ప్రశించారు. ఎప్పటికప్పడు అబద్దాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టడం మోదీ, కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని రేవంత్‌ విమర్శించారు.

‘ఆదిపురుష్’పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్రభాస్

వారికి 25, వీరికి 20.. కత్తెర- కటింగ్ ప్లేయర్

కేంద్రాన్ని ఏమీ అనలేక ఇదేంటి లోకేష్..!

‘అబ్బే.. ఎన్టీఆర్‌ ముందు చిరంజీవి సరిపోడు’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -