Friday, May 3, 2024
- Advertisement -

బీజేపీ నుంచి దాసోజు ఔట్.. టి‌ఆర్‌ఎస్ చక్రం తిప్పిందా ?

- Advertisement -

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఓవైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారాల హోరు జరుగుతుంటే.. మరో వైపు పార్టీలు మారే నేతలు జంపింగ్ జపాంగ్ షురూ చేశారు. ఆ మద్య కాంగ్రెస్ వీడి బీజేపీ గూటికి చేరిన దాసోజు శ్రవణ్.. తాజాగా బీజేపీకి కూడా షాక్ ఇచ్చారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తిగా ఉందని, తనలాంటి బలహీన వర్గాల నాయకుడికి బీజేపీలో స్థానం లేదని దాసోజు చెప్పుకొచ్చారు. మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీ అనుసరిస్తున్న తీరు తనను ఏమాత్రం నచ్చలేదని అందుకే బీజేపీని వీడుతున్నట్లు దాసోజు శ్రవణ్ చెప్పుకొచ్చారు.

బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి లేఖ రాశారు. ఇక ఆయన టి‌ఆర్‌ఎస్ లో చేరానున్నట్లు తెలుస్తోంది. అయితే దాసోజు శ్రవణ్ మొదట్లో టి‌ఆర్‌ఎస్ లో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.. మళ్ళీ కాంగ్రెస్ వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు.. ఇక తాజాగా మళ్ళీ ఆయన టి‌ఆర్‌ఎస్ గూటికే చేరారు. అయితే పట్టుమని నెల తిరగకుండానే దాసోజు బీజేపీ బీజేపీ వీడి టి‌ఆర్‌ఎస్ లో చేరడానికి కే‌సి‌ఆర్ చక్రం తిప్పారనే వార్తలు వస్తున్నాయి. ఓవైపు మునుగోడు ఉపఎన్నిక మరో వైపు ఇంకో ఏడాది కాలంలో సర్వత్రక ఎన్నికలు దీంతో ఆపరేషన్ ఆకర్ష్ ను టి‌ఆర్‌ఎస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సారి స్వయంగా కే‌సి‌ఆర్ యే రంగంలోకి దిగినట్లు వినికిడి. ఇతర పార్టీలలోని అసంతృప్తి నేతలకు కే‌సి‌ఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆఫర్స్ ఇస్తూ టి‌ఆర్‌ఎస్ లో కలిపేసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక దాసోజు శ్రావణ్ బాటలోనే మరికొంత మంది బీజేపీ నేతలు టి‌ఆర్‌ఎస్ లోకి చేరేందుకు సుద్దమౌతున్నట్లు సమాచారం. వీరిలో శాసన మండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్, విఠల్ వంటి వారు కూడా ఉన్నారట. ఇప్పటికే వీరితో కూడా కే‌సి‌ఆర్ సంప్రదింపులు జరిపినట్లు టి‌ఎస్ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల టి‌ఆర్‌ఎస్ నేత బుర్ర నర్సయ్య ఆ పార్టీ వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో అలర్ట్ అయిన కే‌సి‌ఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను బలంగా అమలు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారట.

ఇవి కూడా చదవండి

పోలవరం పూర్తి కావాలంటే.. పవన్ నాలుగో పెళ్లి చేసుకోవాలా ?

నువ్వు నేర్పిన విద్యే.. జగన్ కు జనసేన కౌంటర్ !

తెరపైకి వైస్ జగన్ బయోపిక్.. అదిరిపోయిన వ్యూహం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -