Sunday, April 28, 2024
- Advertisement -

మేయర్ పీఠం కైవసం చేసుకున్న గద్వాల విజయలక్ష్మి!

- Advertisement -

జీహెచ్‌ఎంసీ మేయర్​గా బంజారాహిల్స్‌ టి.ఆర్.ఎస్ కార్పొరేటర్‌, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్‌ పదవి కోసం బిజెపీ తరఫున ఆర్కేపురం డివిజన్‌ నుంచి ఎన్నికైన రాధాధీరజ్‌రెడ్డి నామినేషన్‌ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్‌ నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి మేయర్​గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.

మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంఐఎం మ‌ద్ద‌తు తెలిపింది. చివరికి టీఆర్ఎస్ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పీఠాల‌ను కైవ‌సం చేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబ‌రాలు జరుపుకుంటున్నారు. జీహెచ్​ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది.

 డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని స‌భ్యులు ఎన్నుకున్నారు. ఆమె తార్నాక నుంచి గెలుపొందారు. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ను పీవో శ్వేతా మ‌హంతి ప్ర‌క‌టించారు. మరోవైపు, మేయర్ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికలు: 33 మంది వలంటీర్లు సామూహిక రాజీనామా

విజయ్ దేవరకొండ ‘లైగర్’ డేట్ ఫిక్స్!

బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -