టీఆర్ఎస్ రెబల్ వెనుక ఉన్నది ఎవరు ?

- Advertisement -

తెలంగాణలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఐతే కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి తల నొప్పిలా మారాయి. ఇంతకు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టిస్తున్నది ఎవరు ? కేసీఆర్‌ ఎదుర్కోలేక పోతున్న నేత ఎవరు ?

రాష్ట్రంలో మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థనాల్లో అభ్యర్థులు భరిలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ ఎన్నికల భరిలో నిల్చున్నారు. గతంలో తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని ఆశ చూపిన కేసీఆర్.. ఇప్పుడు తనను పక్కకు నెట్టి వేరొకరిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా భరిలో ఉంచారని రవీంర్ సింగ్ అంటున్నారు.

- Advertisement -

రవీందర్ సింగ్ మాజీ మేయర్‌ కూడా కావడంతో ఆయనకు జిల్లాలో మద్దతు పెరుగుతోంది. మరోవైపు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ తమను పట్టించుకోవడంలేదని ఇదివరకే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో వీరి మద్దతును కూడా రవీందర్ సింగ్ కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు తెర వెనుకాల మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆలస్యంగా సీఎం టూర్ వెనక మర్మమేంటి..?

గరీబొడి జేబుకు చిల్లు

టీకాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారా..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -