టీకాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారా..?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు రోజుల వరి దీక్ష ముగిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సమస్యలు తీర్చుతామని ఢిల్లీకి వెళ్లి ఏంచేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అన్నదాతల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం రైతులతో చలగాటం ఆడుతోందని విమర్శించారు. కేసీఆర్, మోడీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరికి వచ్చాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

మరోవైపు వరి దీక్ష వేదికగా కాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారు. పార్టీలో అందరం పీసీసీలమే, అందరం సీనియర్ నాయకులమే అని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. మనస్పర్దలు పక్కన పెట్టి పార్టీలో నాయకులు అందరూ ఏకమవ్వడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి జానా రెడ్డి అన్నారు. పార్టీలో నేతలు కలిసి పనిచేయడాన్ని కార్యకర్తలు స్వాగతస్తున్నారని తెలిపారు.

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవవడం లేదని, రైతుల సమస్యలు పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. బయటికి నాయకులమంతా ఒక్కటే అని మాట్లాడుతున్నా లోపల ఉండే వేడి లోపలే ఉందని పలువురు రాఆజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీఎం కేసీఆర్ వ్యూహ రచన

మరో ముప్పు ముంచుకొస్తుంది

రెడ్ అలర్ట్…. ఏపీ,తమిళనాడుకి భారీ వర్ష !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -