Thursday, May 2, 2024
- Advertisement -

పార్టీలోకి రావాలంటే వెన‌క‌డుగు వేస్తున్న ఎమ్మెల్సీ …?

- Advertisement -

ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. సాధారణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు తమ భవితవ్యంపై ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఏపార్టీలోకి వెలితే భ‌విష్య‌త్ బుగుటుంద‌ని బేరీజు వేసుకుంటున్నారు. ఎక్కువ‌గా అధికార పార్టీ టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు భారీగా ఉండ‌నున్నాయి.

ఇప్ప‌టికే అనేక మంది టీడీపీ, కాంగ్రెస్ నాయ‌కులు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. కాశం జిల్లాలో పట్టు సాధించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం ను పార్టీలో తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకోసం ఆయ‌న్ ఆయ‌న‌కు బంఫ‌ర్ అఫ‌ర్ ఇచ్చారంట‌.

వాస్తవానికి 2014 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్, టీడీపీ అభ్యర్థిగా కరణం బలరాం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు.

రాబోయే ఎన్నికల్లో అద్దంకి టిక్కెట్ తన కుమారడు వెంకటేష్ కు ఇవ్వాలని కరణం బలరాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కోరారట. అయితే టిక్కెట్ ఇవ్వడం కుదరదని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. దీంతో కరణం బలరాం వైసీపీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.

జగన్ వద్ద కూడా తన కుమారుడు కే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టారట. అయితే ముందు పార్టీలో చేరండి ఆ తర్వాత చూద్దాం అని జగన్ అన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అద్దంకి నియోజకవర్గానికి బాచిన చెంచు గరటయ్య ఇంచార్జ్ గా ఉండటంతో జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీలోకి రావాలని మాత్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే క‌ర‌ణం చేరిక మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఒకవేళ క‌రనణం పార్టీ మారాల్సి వస్తే ఎన్నికల ముందు వస్తారని సమాచారం. ఇప్పటికే కరణం బలరాంపై ఫ్యాక్షన్ కేసులు ఉన్నాయి. ఈనేపథ్యంలో బలరాం పార్టీ జంప్ అయితే వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందని వెనుక‌డుగు వేస్తున్నారంట‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం వైసీపీలోకి మార‌డం తేల్చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -