Monday, April 29, 2024
- Advertisement -

ఇండోర్ వన్డే..రికార్డులు ఇవే

- Advertisement -

భారత్ – ఆసీస్ మధ్య ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ గెలుపొందింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 33 ఓవర్లలో ఆసీస్ 317 పరుగులు చేయాల్సి ఉండగా 28.3 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మూడు వన్డేల సీరిస్‌ను భారత్ 99 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నెల 27న మూడో వన్డే జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు వన్డేల్లో ఆసీస్ 9వ వికెట్‌కు హైయెస్ట్ పార్ట్‌నర్ షిప్ 115 కాగా సీన్ అబాట్ – హాజల్‌వుడ్ 77 పరుగులు చేశారు. ఇది నాలుగో అత్యధిక 9వ వికెట్ పార్ట్‌నర్‌ షిప్. ఇక నెంబర్ 8 స్ధానంలో వచ్చి అత్యధిక సిక్స్ లు బాధిన 5వ ఆటగాడిగా నిలిచాడు సీన్ అబాట్. తన ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు బాధాడు అబాట్. అంతకముందు ఈ రికార్డు ఫాల్క్‌నర్ 6 సిక్స్‌ల పేరుతో ఉంది. ఇక రవీచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడం ద్వారా ఓవరాల్‌గా ఓ టీమ్‌పై అత్యధిక వికెట్లు 144 తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక ఇండోర్‌లో 7 సార్లు ఆసీస్‌ని ఓడించింది భారత్.

వన్డే సిరీస్‌ ఓటమి పరంగా చూస్తే ఆసీస్‌తో చివరిగా 2-1 తేడాతో ఆ జట్టును ఓడించింది భారత్. అయితే ఇప్పుడు హోమ్ గ్రౌండ్స్లో ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్ చేస్తే 3-0 తేడాతో ఓడించడం ఇదే తొలిసారి కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -