Monday, April 29, 2024
- Advertisement -

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ ఆశ‌ల‌పై నీళ్లుజల్లిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌

- Advertisement -

ఐపీఎల్ తాజాగా సీజ‌న్‌లో మొద‌ట్లో వ‌రుస విజ‌యాల‌తో మంచి ఊపు మీద ఉన్న‌ట్లు క‌నిపించింది కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌. దినేశ్ కార్తిక్ సార‌థ్యంలోని కేకేఆర్ వ‌రుసగా నాలుగు విజ‌యాలు సాధించి ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేలా క‌నిపించింది. అయితే సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయింది. ఆ త‌రువాత ఒక్క విజ‌యం కూడా సాధించ‌లేదు కేకేఆర్ జ‌ట్టు. డ‌బుల్ హ్యాట్రిక్ ప‌రాజ‌యాల‌తో ప్లే ఆఫ్ రేసు నుంచి ఆల్ మోస్ట్ త‌ప్పుకుంది కేకేఆర్‌. గురువారం రాత్రి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డింది కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌.

ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను దినేశ్‌ కార్తీక్‌ అజేయ ఇన్నింగ్స్‌తో నడిపించాడు. సెంచ‌రీ సాధించేలా క‌నిపించిన దినేశ్ కార్తిక్ 97 ప‌రుగుల‌తో నాటౌట్‌గా మిగిలాడు. కార్తీక్‌ ఒంటరి పోరాటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు అజింక్య రహానే ( 34), సంజూ సామ్సన్‌ (22) గ‌ట్టి పునాది వేశారు. ఓ దశలో కుదేలైన రాజస్తాన్ జ‌ట్టు ఓడిపోతుంద‌ని అంద‌రు భావించారు.

కాని ఏడో వికెట్‌కు 21 బంతుల్లో 44 పరుగులు జోడించి పరాగ్, ఆర్చర్‌ గెలుపు బాట పట్టించారు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన స్థితిలో ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఆర్చర్‌ ఫోర్, సిక్స్‌ కొట్టి ముగించేశాడు. దీంతో ఆ జట్టు 19.2 ఓవర్లలోనే ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి నెగ్గింది. రాయల్స్‌ పేసర్‌ వరుణ్‌ ఆరోన్‌ (2/20)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -