Wednesday, May 1, 2024
- Advertisement -

ఓపెనర్ గా సూర్య కుమార్..రాహుల్ కష్టమే!

- Advertisement -

ప్రస్తుతం క్రీడా రంగంలో సూర్యకుమార్ యాదవ్ పేరు చాలగట్టిగా వినపడుతోంది. గత కొన్నాళ్లుగా సూర్య కుమార్ టి20 లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. సూర్య ప్రధర్శనకు ప్రపంచ మేటి ఆటగాళ్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూర్య కుమార్ ఏ స్థాయిలో రాణించడో అందరికీ తెలిసిందే. టీమిండియా సెమీస్ వరకైనా వెళ్లగలిగిందటే అది కూడా సూర్య, కోహ్లీల చలువే. ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున స్కై.. టీమిండియా టి20 జట్టులో కీలక ఆటగాడి ఉన్నాడు. ఇక వరల్డ్ కప్ తరువాత టీమిండియా న్యూజిలాండ్ తో మూడు టి20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ లు అడనుంది.

ఈ కివీస్ పర్యటనలో టీమిండియా కీలక ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో టి20 లకు హర్ధిక్ పాండ్య, వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాద్యతలు చేపట్టనున్నారు. ఇక టి20 మ్యాచ్ లలో రెగ్యులర్ ఓపెనర్స్ రోహిత్ శర్మ, కే‌ఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఈసారి ఓపెనర్స్ గా శుబ్ మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నారు.

సాధారణంగా నాలుగో స్థానంలో క్రీజ్ లోకి వచ్చే సూర్య.. ఓపెనర్ గా బరిలోకి దిగడం సానుకూలశం ఎందుకంటే.. ఓపెనర్స్ ప్రధర్శన వల్లే తరువాత వచ్చే బ్యాట్స్ మెన్స్ పై పెద్దగా ఒత్తిడి ప్రభావం ఉండదు. అంతేకాకుండా ఓపెనర్స్ కుదురుకుంటే ఎక్కువసేపు క్రీజ్ లో గడిపే అవకాశం ఉంటుంది. అందువల్ల సూర్య ఓపెనర్ గా రాణిస్తే.. భారీ స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సూర్య ఓపెనర్ గా సక్సస్ అయితే రెగ్యులర్ ఓపెనర్ గా సూర్య నే కొనసాగే అవకాశం లేకపోలేదు. అలాగైతే రాహుల్ కు కష్టమే అని చెప్పాలి. ఇక న్యూజిలాండ్ టీమిండియా మద్య మొదటి టి20 మ్యాచ్ ను నవంబర్ 18 న ప్రారంభం కానుంది. మరి వరల్డ్ కప్ లో పరాభవం తరువాత జరుగుతున్నా ఈ సిరీస్ లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -