Thursday, May 2, 2024
- Advertisement -

మృత్యు పోరులో ఓడిన మాజీ ముఖ్యమంత్రి..!

- Advertisement -

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ… గువాహటి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. తరుణ్​ గొగొయి(84) ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్​ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్​ కాలేజ్​ ఆసుపత్రిలో చేరారు. అయితే.. గత శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్​ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదు.

చివరకు ఈ సాయంత్రం కన్నుమూసినట్లు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.తరుణ్​ గొగొయి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంవత్సరాల అనుభవమున్న నేతను కోల్పోవడం తనను కలచివేసిందని చెప్పారు. గొగొయి కుటుంబసభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జ్యోతిష్కుడు చావుకి వంద కారణాలు..!

గాంధీ వారసుడు మృతి..!

వివాదాస్పద డోక్లామ్లో చైనా రహదారి నిర్మాణం..!

కరోనాతో ఒడిశా ప్రథమ మహిళ మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -