Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్నికలు వస్తేనే పథకాల అమలు జరుగుతుందా ?

- Advertisement -

తెలంగాణలో ఈ నెల ఆగష్టు 15 నుంచి కొత్తగా పది లక్షల మందికి పింక్షన్లు మంజూరు చేస్తామని, అది కూడా 57 ఏళ్ళు నిండిన వారికి వృద్దాప్య పింక్షన్ కింద ప్రతి నెల రూ.2,016 ఇస్తామని సి‌ఎం కే‌సి‌ఆర్ ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం కే‌సి‌ఆర్ ప్రకటించిన ఈ పింక్షన్ల పెంపుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో కొత్తగా పింక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైన చాలా మంది గత మూడేళ్ళ కాలం నుంచి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మూడున్నర ఏళ్ళ కాలంలో గుర్తుకు రాని కొత్త పింఛన్ దారులు.. ఇప్పుడేందుకు సి‌ఎం కే‌సి‌ఆర్ కు గుర్తొచ్చారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ పింక్షన్ల పెంపు మరియు నేతన్న నేస్తం వంటివి కే‌సి‌ఆర్ పోలిటికల్ స్ట్రాటజీ అని కొందరి అభిప్రాయం. ఎందుకంటే గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా కే‌సి‌ఆర్ దళితులను ఆకర్శించేందుకు హటాత్తుగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల సమయంలో కూడా పలు హామీలను ఉన్నఫలంగా హైదరబాద్ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ విధంగా చూస్తే కేవలం ఎన్నికల సమయంలో ప్రజల దృస్తి ప్రభుత్వంపై ఉండేలా కే‌సి‌ఆర్ వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం.

ఇప్పుడు తాజాగా మునుగోడు ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి ప్రభుత్వంపై ఉండేలా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పింక్షన్ల పెంపు వ్యూహాన్ని కే‌సి‌ఆర్ ఇప్పుడు అమలు చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే సూచన కూడా బలంగా కనిపిస్తుండడంతో కే‌సి‌ఆర్ కొత్త హామీల విషయంలో వేగంగా ముందుకు కదులుతున్నారు. మరి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ పథకాల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Also Read

నేతలు మారితే ఓటర్లు మారతారా ..!

మోడీ జోక్యంతో.. జగన్ వెనక్కి తగ్గుతాడా ?

చంద్రబాబు బాటలోనే కే‌సి‌ఆర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -