టాక్ తేడాగా ఉన్నా.. వసూళ్లు 250 కోట్లు..

- Advertisement -

రజనీకాంత్ కు ఏ మాత్రం ఫాలోయింగ్ తగ్గలా..ఆయన చేస్తున్న సినిమా ఎలా ఉన్నా .. వసూళ్లు మాత్రం భారీగానే ఉంటాయి. కబాలీ నుంచి రజినీ సినిమాలకు టాక్ పెద్దగా పాజిటివ్ గా వచ్చింది లేదు. మధ్యలో రోబో 2.0 కు టాక్ బావున్నా, బడ్జెట్ ఎక్కువవటంతో రికవర్ అవ్వలేకపొయింది.

ఇక కరోనా అనంతరం బాగున్న సినిమాలు కూడా కలెక్ట్ చేయలేక సతమతమవుతున్న తరుణంలో , రజినీ “అన్నాత్తే ” టాక్ తేడాగా ఉన్నా 250 కోట్ల మార్క్ ను రీచ్ అయింది‌. మాస్టర్ తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం ఇదంతా సూపర్ స్టార్ క్రేజ్ వల్లే సాధ్యమయింది. కంటెంట్ పరంగా అన్నాత్తే లో విషయం లేదని తొలిరోజే టాక్ వచ్చింది.

- Advertisement -

దర్శకుడు శివ గతంలో తీసిన వేదాలం సినిమానే మళ్లీ అటు గా ఇటుగా అన్నాత్తే గా తీశాడని అన్నారు. మరోపక్క మాస్ సినిమాలకు లాజిక్ లు ఉండవని, తమ అభిమాన హీరో ఎలా మ్యాజిక్ చేశాడన్నదే ముఖ్యమని ఫ్యాన్స్ చెబుతున్నారు. చెన్నై లో వరదలొచ్చి సిటి సగం మునిగినా , అవెవి అన్నాత్తే వసూళ్లకు బ్రేక్ వేయలేకపొవటం విశేషం.. !!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

ట్రోలింగ్ భారీన పడ్డ పుష్ప

కోటి కావాలంటున్న మెహరీన్

సినిమా హిట్టే .. కలెక్షన్ నిల్..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -