Monday, April 29, 2024
- Advertisement -

23కు చేరిన బొగ్గుగని మృతుల సంఖ్య..!

- Advertisement -

చైనా యోంగ్​ చువాన్​ జిల్లాలోని డయాచువాన్​ బొగ్గుగనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరినట్లు అధికారులు తెలిపారు. చెత్తను తొలగించే క్రమంలో 24మంది కార్మికులు ప్రమాదవశాత్తు గనిలో చిక్కుకున్నారు. వీరిలో శనివారం 18 మంది మృతించెందారు. ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు.


కార్బన్​ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదల అవ్వటం కారణంగా కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

డియోషుయిడాంగ్​ బొగ్గు గనిని 1975లో ప్రారంభించారు. 1998లో దానిని ప్రైవేటుపరం చేశారు. ఇందులో ఏడాదికి 120,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2013, మార్చిలో ఇదే గనిలో హైడ్రోజన్​ సల్ఫైడ్​ విషవాయువుతో ముగ్గురు మరణించినట్లు జిన్హువా తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -