Monday, April 29, 2024
- Advertisement -

తుఫాను బాధితుల‌కు ఏడాది పాటు జీతం విరాళం ఇచ్చిన సీఎం..

- Advertisement -

ప్రచండ తుఫాన్ ‘ఫణి’ ధాటికి తీర రాష్ట్రం ఒడిశా కుదేలైంది. దీంతో భారీ న‌ష్ట‌న్ని మిగిల్చింది. ఫణి బారిన పడి తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త‌న ఏడాది వేత‌నాన్ని న‌ష్ట‌పోయిన బాధితుల‌కు విరాళంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరి ప్రాణం ఎంతో విలువైందని అన్నారు. ప్రజలను కాపాడుకునేందుకు నేను, నా ప్రభుత్వం ఎంత కష్టమైనా భరిస్తామని తెలిపారు.

సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయంతో సుమారు రూ.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందనున్నాయి. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా సీఎం తీసుకున్న నిర్ణయంపై ఒడిశా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఫొని తుఫాను సహాయక చర్యలకు మేము నిర్ధిష్టమైన ప్రణాళికలు వేసుకున్నామని, వాటిని సాధించి తీరుతామని నవీన్ పట్నాయక్ అన్నారు.తుఫాను ధాటికి నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -