Monday, April 29, 2024
- Advertisement -

తెలంగాణ నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

- Advertisement -

రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ శుభవార్త చెప్పారు. త్వరలోనే నిరుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించవచ్చని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన టీఆర్‌వీకేఎస్‌ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం) సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..

ఇది మీ, మా ప్రభుత్వం. ప్రత్యేక చొరవ తీసుకుంటాం. మౌలిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతున్నాయి. అందులో మీ కృషి కూడా ఉంది. వాయు వేగంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసాం. సాగు తాగు నీరు ఇస్తున్నాం. ధాన్యబాండగారంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆరున్నర ఏళ్లలో అన్ని పూర్తి చేశారు కేసీఆర్. 945 గురుకుల పాఠశాలలు, విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఆర్థికంగా చేయూత. నిరుద్యోగ భృతి రేపో మాపో కేసీఆర్ ప్రకటిస్తారు. 50 వేల ఉద్యోగాలు కూడా ప్రకటించారు. అవి కూడా భర్తీ చేస్తాం. ప్రతి రంగాన్ని ఎక్కడ లోటు లేకుండా న్యాయం చేశారు సీఎం కేసీఆర్.

నిన్న ఇవాళ కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకరు టీపీసీసీ, ఒక టీ బీజేపీ. ఈ టీ(తెలంగాణ)అనే పదం కేసీఆర్ పెట్టిన భిక్ష. తెలంగాణ తీసుకొచ్చింది సీఎం కేసీఆర్. పెరిగిన ఆదాయం అన్ని రంగాలకు చేయూతకే. ఇలాంటి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలిన ఇష్టానుసారంగా మాట్లాడిన మీరు తప్పక తిప్పికొట్టాలి. రాష్ట్ర సాధనకు మీరు ఏ విధంగా ఉద్యమం చేశారో అలాగే వీటిని కూడా తిప్పికొట్టాలి.’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

మరోవైపు, త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఊహాగానాలు బాగా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగ భృతి పథకాన్ని సీఎం హోదాలో కేటీఆరే అమలు చేయవచ్చనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వినిపిస్తుంది.

వర్మతో పవన్‌ కల్యాణ్‌ మూవీ…

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

మతిపోయిన మాజీ సీఎంపై ఏం చర్యలు తీసుకుంటారు..?

ఏకగ్రీవాలైతే నష్టమేంటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -