Thursday, May 2, 2024
- Advertisement -

కేజ్రీ పై మ‌రో పిడుగు పేల్చిన క‌పిల్‌మిశ్రా

- Advertisement -
More shocking charges against AAP and Arvind Kejriwal

ఆప్ పార్టీ క‌న్వీన‌ర్ …ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప‌రిస్థితి ఇప్పుడు కుడితో ప‌డిన ఎలుకలాగా త‌యార‌య్యింది.వ‌రుస అవినీతి ఆరోప‌న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేజ్రీకి ఇప్పుడ మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది.ఇప్ప‌టికే అనేక ఆరోప‌నుల ఎదుర్కొంటున్న కేజ్రీ పై బహిష్కృత నేత క‌పిల్ మిశ్రా మ‌రోబాబు పేల్చారు.

ఈసారి ఏకంగా కేజ్రీవాల్‌ డొల్ల కంపెనీలు పెట్టి నల్లధనాన్ని వైట్‌గా మార్చారని కపిల్‌ మిశ్రా ఆరోపించారు. ఎన్నిలక సంఘానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని తెలిపారు.
ఆదివారం తాను చెప్ప‌బోయే విష‌యాల‌తో ఢిల్లీ రాప‌కీయాలు మ‌రింత వేడుక్కుతాయ‌ని చెప్పిన క‌పిల్ మిశ్రా అనుకున్నంత ప‌నిచేశారు.ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిం​దని, ఢిల్లీ ప్రజలను మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొహల్లా క్లినిక్‌ కుంభకోణంలోనూ ఆప్‌ నేతల పాత్ర ఉందన్నారు. ఆప్‌ నేతల విదేశీ పర్యటనల ఖర్చపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}

కేజ్రీ వాల్ షెల్‌ కంపెనీ నుంచి ఆప్‌ రూ. 2 కోట్ల విరాళం తీసుకుందని వెల్లడించారు. ఇవన్నీ కొంతమందికి తెలిసినా ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు లిఖిత పూర్వక సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం​ చేశారు.పార్టీ విరాళాలకు సంబంధించి వారు చెబుతున్న లెక్కలకు, ఈసీకి సమర్పించిన వివరాలకు పొంతన లేదన్నారు. నాలుగు కంపెనీల్లో అక్రమాలకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసు పంపిందని తెలిపారు. ఆయనకు అక్రమంగా వందలాది కంపెనీలు ఉన్నాయని, ఈ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయని ఆరోపించారు.
కేజ్రీకున్న కంపెనీలకు సంబంధించిన అధికారిక పత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు. షెల్‌ కంపెనీలన్నీ కేజ్రీవాల్‌ నెలకొల్పినవేనని, యాక్సిస్‌ బ్యాంకు ద్వారా నల్లధనాన్ని వైట్‌గా మార్చారని తెలిపారు.వీటిమీద కేజ్రీ ఎలా స్పందిస్తారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Realted

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -