Thursday, April 25, 2024
- Advertisement -

బాబు మాదిరే జ‌గ‌న్‌కూడా ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టుపెట్టారా…?

- Advertisement -
YSRCP President YS Jagan Mohan Reddy on AP Special Status issue

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వాలు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాట‌మార్చిన సంగ‌తి తెలిసిందే.ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంది ఎన్‌డీఏ ప్ర‌భుత్వం.

మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ మాత్రం ప్ర‌త్యేక హోదాను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాయి. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టును పెట్టార‌ని రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష‌పార్టీలు. విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక హోదాకోసం అన్ని పార్టీలు రాస్తారోకోలు,ఉద్య‌మాలు చేసిన సంద‌ర్భాలున్నాయి.
ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అంశంమ‌ని కేంద్రం తేల్చి చెప్పింది.అయినా వైసీపీ,ప‌వ‌ణ్‌క‌ళ్యాన్‌లు మాత్రం ప్ర‌త్యేక హోదా తోక‌ను ప‌ట్టుకొని వేలాడుతున్నాయి. ప‌వ‌ణ్ క‌ళ్యాన్ ఇప్ప‌టికి టీడీపీకి పేవ‌ర్ గానే ఉన్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.అయితే జ‌గ‌న్ మాత్రం ప్ర‌త్యేక‌హ్యోదాపై ముందునుంచి త‌న గొంతును వినిపిస్తున్నారు.అయితే ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు గుప్పించారు సీపీఐ పార్టీ నేత‌లు.
దీనికి ప్ర‌ధాన కార‌ణం వారంరోజుల క్రితం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీని వ‌ల‌వ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఒక కుదిపు కుదిపింది.అధికార టీడీపీ …ప్ర‌తిప‌క్ష వైసీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే కొన‌సాగింది.అయితే టీడీపీ మిత్ర‌ప‌క్షం భాజాపా మాత్రం జ‌గ‌న్‌ను వెనుకేసుకొచ్చింది. రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో పూర్తి మ‌ద్ద‌తును భాజాపాకు ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.దీనికి తోడు వైసీపీ,భాజాపా రెండు పార్టీలు క‌ల‌సిపోయాయ‌నే వార్త‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.వీటికి బ‌లాన్ని చేకూరుస్తూ భాజాపా అధిస్టానం…రాష్ట్ర పార్టీ క‌మ‌ళ ద‌ళం జ‌గ‌న్‌కు అనుకూలంగా మాట్లాడిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా ఉన్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్ర‌త్యేక హోదా ముగిసిన అంశంని ఇప్ప‌టికే పార్ల‌మెంట్‌లో సాక్ష్యాత్తు కేంద్ర మంత్రులే ప్ర‌క‌టించారు.కాని జ‌గ‌న్ మాత్రం ప్ర‌త్యేక హోదాను వ‌దిలి పెట్ట‌డంలేదు.అది బాగానే ఉంది కానీ…ఇప్పుడు జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక‌హోదాను మోదీ ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టాడ‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.ఇప్ప‌టికే సీపీఐ ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ జ‌గ‌న్‌పై చేసిన ఆరోప‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.జ‌గ‌న్ మోస‌గాడు అంటూ ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న అన్న దాంట్లో కూడా నిజం లేక‌పోలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.
జ‌గ‌న్‌పై ఉన్న సీబీఐ కేసుల‌నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే మోదీని క‌లిశార‌ని రాష్ట్రంలోని క‌మ్యూనిస్ట్‌పార్టీలు,అధికార పార్టీ టీడీపీలు ఆరోప‌నలు గుప్పించాయి.ప్ర‌త్యేక హోదా లేద‌నే విష‌యం ఇప్ప‌టికే స్ప‌ష్టంగా తెలిసిందే.అయినా జ‌గ‌న్ మోదీ ఎందుకు క‌లిశార‌నేది ఇప్పుడు ర‌హ‌స్యంగా మారింది.జ‌గ‌న్ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటె కేంద్రం ద‌గ్గ‌ర ప్ర‌త్యేక హోదా అనే అంశాన్ని మ‌ర్చిపోవాల్సిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజాపా,వైసీపీ క‌ల‌సి పోటీచేయాల‌ని చూస్తున్నాయి.మ‌రి అట్లాంట‌ప్పుడు జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా అని ఎలా అడుగుతార‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.జ‌గ‌న్ త‌న కేసుల‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి….. ప్ర‌జ‌లను మోసం చేయ‌డానికే ప్ర‌త్యేక హోదాని ప‌ట్టుకొని వేలాడుతున్నార‌నేది ప్ర‌జ‌ల‌ల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది.

{loadmodule mod_custom,Side Ad 2}

గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాలు అయిపోయ‌నత‌ర్వాత త‌న ఎంపీల‌చేత రాజీనామ చేయిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు మాట‌మార్చారు.రాజీనామ సంగ‌తే ఉసెత్త‌లేదు. ప్ర‌త్యేక హోదా సెంటీ మెంట్‌ను అడ్డం పెట్టుకొని రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి.ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో కాల‌మే తేల్చాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -