Monday, April 29, 2024
- Advertisement -

ఎమ్మెల్యే జోగి రమేష్‌ పిటిషన్ వాయిదా.. ఏమవుతుందో..!

- Advertisement -

తనను మీడియాతో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరితోనూ మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారని ఎస్‌ఈసీ తరుఫు న్యాయవాది అశ్వినీకుమార్‌ వాదించారు.

ఎన్నికలకు సంబంధించి ఆయన మాట్లాడారన్న దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. జోగి రమేష్‌ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఎస్‌ఈసీ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

మంత్రి కొడాలి నాని హౌస్‌మోషన్ పిటిషన్‌పై మరోసారి హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మంత్రి మాట్లాడిన వీడియో టేపులు సమర్పించాలని ఇప్పటికే ఎస్​ఈసీని కోర్టు ఆదేశించింది.

వైఎస్ ష‌ర్మిల చేతుల మీదుగా ఏమిటో ఏమిటో!?

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా!

టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -