Monday, April 29, 2024
- Advertisement -

సీఎం జగన్ పై నిమ్మగడ్డ మరో అస్త్రం!

- Advertisement -

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అధికారులు పని చేస్తారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ అందరూ కలిసే ఉంటారని.. అప్పటివరకే ఇలాంటి విభేదాలని అన్నారు.

ఎన్నికలను నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆయన కోరారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ను ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఉద్ఘాటించారు. ఎన్నికల విషయంలో చాలా గ్రామాలు ఒకే ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాయని.. ఆదర్శవంతంగా స్పందించాయని ప్రశంసించారు. నాయకత్వ బాధ్యతల కోసం పోటీపడడం శుభపరిణామమన్న ఆయన.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

రైతుల ఉద్యమంపై కోహ్లీ ట్వీట్, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.

మలయాళంలో రాజశేఖర్.. తెలుగులో శేఖర్..!

బాబు మాటలతో విస్మయానికి గురైన క్యాడర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -