Thursday, May 2, 2024
- Advertisement -

టీఆర్‌ఎస్‌, బీజేపీది బ్లేమ్‌ గేమ్ : రేవంత్

- Advertisement -

వరి కొని రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ దీక్షలపై ట్విటర్ వేదికగా రేవంత్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్, గల్లీలో బీజేపీ.. దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. రైతులను ఇబ్బందుకు గురి చేస్తున్న ఈ రెండు పార్టీలకూ రైతులే రాజకీయ సమాధి కడతారన్నారు.

సీఎం కేసీఆర్ చేస్తున్న దోపిడీని గ్రామాల్లో సభలు పెట్టి బయటపెట్టామని రేవంత్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా పది ప్రశ్నలను రేవంత్ సంధించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినది వాస్తవం కాదా అని రేవంత్ ప్రశ్నించారు.

ఆ లేఖను అడ్డుపెట్టుకుని ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మెలికపెడుతున్న విషయం నిజం కాదా అని నిలదీశారు. కేంద్ర రాష్ట్రాల బ్లేమ్ గేమ్‌తో ఇప్పటికే రైతులు దళారీల చేతుల్లో నష్టపోతున్న విషయంలో నిజం లేదా అని ప్రశ్నించారు. మరోవైపు మంగళవారం నుంచి ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ఆందోళనలకు దిగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అల్టిమేటం

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ రైతు సభ

ఏపీలో కొలువుతీరిన కొత్త కేబినెట్.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -