Monday, April 29, 2024
- Advertisement -

“రాజన్న.. సన్యాసం ఎప్పుడన్నా ” కోమటిరెడ్డిపై సెటైర్స్ !

- Advertisement -

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టి‌ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో దాదాపు 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజిక వర్గంలో బలమైన నేతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అంతే కాకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇక మొదటి నుంచి కూడా మునుగోడులో విజయం తనదేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. .

బీజేపీ అధిష్టానం కూడా కోమటిరెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తపరుస్తూ నానా హంగామా చేసింది. తీర బైపోల్ రిజల్ట్స్ లో అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. ఊహించని విధంగా ఓటమి చవిచూశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే మునుగోడు ప్రజల తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. అధికారికంగా టి‌ఆర్‌ఎస్ గెలిచినప్పటికి నైతికంగా తానే గెలుపొందినట్లు ఆయన అన్నారు. అయితే గతంలో కోమటిరెడ్డి అన్న వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. మునుగోడులో టి‌ఆర్‌ఎస్ ఓడిపోతుందని, ఒకవేళ మునుగోడులో టి‌ఆర్‌ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఆయన ఓటమిపాలు కావడంతో ” రాజన్న.. సన్యాసం ఎప్పుడన్నా.. ” అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇదే తీరును గతంలో బండ్ల గణేశ్ కూడా ఎదుర్కొన్నా సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తాను బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని బండ్ల చేసిన కామెంట్స్ అప్పుడు ఏ రేంజ్ లో సంచలనం అయిందో మనందరం చూశాం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా సీన్ రిపీట్ కావడంతో సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డిపై ఓ రేంజ్ లో ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. మరి తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పుకొచ్చిన రాజగోపాల్ రెడ్డి తన ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాజకీయాలకు దురమౌతారా ? లేదా పాలిటిక్స్ లో ఇవన్నీ మామూలే అని లైట్ తీసుకుంటారా ? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

జగన్ ఇల్లు కూల్చితే.. ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చుతారు !

బీజేపీ తెగించిందా.. ఏంటి ఈ కబ్జా రాజకీయాలు !

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -