Monday, April 29, 2024
- Advertisement -

బీజేపీ పై సెటైర్లు : డబుల్ ఇంజన్ సర్కార్ లో.. ఇంజన్ ఉందా ?

- Advertisement -

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆయా రాష్ట్రాల్లో కూడా అధికరంలోకి వచ్చేందుకు పదే పదే డబుల్ ఇంజన్ సర్కార్ మంత్రాన్ని వల్లిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ది సులువౌతుందని కమలనాథులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ” డబుల్ ఇంజన్ సర్కార్ ” మంత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెల్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అయితే బీజేపీ ఎత్తుకున్న ఈ ” డబుల్ ఇంజన్ సర్కార్ ” మంత్రంపై కాంగ్రెస్ నేతలు.. మరియు విపక్ష పార్టీలు తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు.

తాజాగా ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వ్యంగ్యస్త్రాలు సంధించారు. డబుల్ ఇంజన్ సర్కార్ లో ఇంజన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో గత అయిదేళ్లుగా బీజేపీ నేతృత్వంలోనే ఉందని అయినప్పటికి ఇక్కడ ఎలాంటి అభివృద్ది లేదని ప్రియాంకా విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్ ను అభివృద్ది చేయడంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏమనట్లు అంటూ ప్రశ్నించారు.

ఇక 2024 ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకోచ్చేందుకు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్ర ప్రారంభించి దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ చేపట్టిన జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడం కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక ప్రియాంక గాంధీ కూడా వివిద ప్రాంతాల పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. మరి వీరి ప్రయత్నాలు కాంగ్రెస్ కు ఎంతవరకు మేలు చేస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

జగన్ కు పవన్ వార్నింగ్ లు..ఫైర్ వెనుక అసలు కథ!

మునుగోడు విజయం టి‌ఆర్‌ఎస్ కు మంచి బూస్టప్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -