Monday, April 29, 2024
- Advertisement -

సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తారా..?

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌కి ముందు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోంది టీమిండియా. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది భారత్. ఇక తొలి వన్డే మొహాలీలో ఆసీస్‌ను ఓడించి13 ఏళ్ల త‌ర్వాత ఆ జట్టును మట్టికరిపించింది. ఇక రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా ఆసీస్ బౌలర్లపై దండయాత్ర చేశారు భారత బ్యాట్స్‌మెన్. ఈ మ్యాచ్‌లో 399 పరుగులు చేసింది భారత్.

ఇక ఇవాళ మూడో వన్డే జరగనుండగా ఆసీస్ జట్టును ఓడించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు.

అయితే భారత్‌కు కలిసొచ్చే అంశం ఏంటంటే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్ధిక్ పాండ్య జట్టులోకి వస్తుండగా శుబ్ మన్ గిల్ శార్థూల్ ఠాకూర్ కు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, ఇషన్ కిషన్ బరిలో దిగే అవకాశం ఉండగా భారత జట్టు దూకుడు చూస్తుంటే ఈ మ్యాచ్ గెలవడం పెద్ద విశేషమేమి కాదనిపిస్తుంది.ఇక ప్రపంచ కప్‌కి ముందు ఈ రెండు జట్లకు ఇదే చివరి వన్డే కావడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా కీలకమే. అందుకే నామమాత్రమైన మూడో వన్డేలో గెలుపుకోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -