Tuesday, April 30, 2024
- Advertisement -

భ‌విష్య‌త్తులో అఖిల‌ప్రియ ఒంట‌రేనా…!

- Advertisement -
Bhuma Akhila Priya Reddy Political Feature

రాష్ట్రంలో ఇప్పుడు నంద్యాల రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలల్లో భూమా క‌టుంబం చెర‌గ‌ని ముద్ర‌వేసింది.అయితే ఇప్పుడు ప‌రిస్థితులలో మార్పు క‌నిపిస్తోంది. మంత్రి అయిన త‌ర్వాత భూమా అఖిలప్రియ ధిక్కార స్వ‌రం ఆమెను నంద్యాల రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్తులో ఒంట‌రివారిని చేయ‌బోతుందా.. అంటే అవున‌నే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

అఖిలప్రియ ఎవ‌రినీ లెక్క‌చేయ‌క‌పోవ‌డం..ఆమె అహంకార‌మే ఆమెను నంద్యా రాజ‌కీయాల్లో ఒంట‌రి అయ్యే అవ‌కావం ఉంద‌ని భావిస్తున్నారు. శోభానాగిరెడ్డి మ‌ర‌నించ‌డంతో భూమా అఖిల‌ప్రియ ఆస్తానం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆత‌ర్వాత జ‌రిగిన ప‌రినామాల‌తో టీడీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఆ సంతోషాన్ని దేవుడు ఎక్క‌వ కాలం ఉంచ‌లేదు. పాపం అఖిల‌ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి హ‌ఠాత్మ‌ర‌నంతో కుటుంబంలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. ఆకుటుంబానికి అండ‌గా ఉండేందుకు అతి చిన్న వ‌య‌సులోనే మంత్రిగా చంద్ర‌బాబు స్తానం క‌ల్పించారు. ఇక అఖిల ప్రియ రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకుంటుంద‌ని అంద‌రూ భావించారు.కానీ ప‌ద‌వి వ‌చ్చిన త‌ర్వాత ఆమెలో మార్పు క‌నిపిస్తోంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
తల్లిదండ్రులు లేకపోవడంతో కేబినెట్ లో అందరికి కంటే తక్కువ వయస్కురాలు కావడంతో అందరూ ఆమె పట్ల సానుభూతితో వ్యవహరించేవారు. అయితే భూమా అఖిల ప్రియ మంత్రి అయిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు బాగుండడం లేదని సీనియర్ నేతలు అంటున్నారు. ఇటీవల భూమా అఖిలప్రియ వ్యవహార శైలిపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.ఆజిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత ఉప‌ముఖ్య‌మంత్రి కే.యీ. కృష్ణ‌మూర్తిని ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర్యాద పూర్వ‌కంగానైనా క‌ల‌వ‌లేద‌ని పెద్ద‌లంటే గౌర‌వం లేదాని బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. ఉప ముఖ్యమంత్రి కూడా నొచ్చుకున్నారట.
మ‌రో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను కూడా భూమా అఖిలప్రియ లెక్కచేయలేదట. ఆయన ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనకు రాగా ఆమె కనీసం పట్టించుకోలేదట. ఉప ముఖ్యమంత్రి వస్తున్న విషయాన్ని అధికారులు ముందుగానే అఖిలప్రియకు తెలియజేశారు.కానీ అఖిలప్రియ మాత్రం చినరాజప్పకు కనీసం స్వాగతం పలికేందుకు కూడా వెళ్లలేదు. అఖిలప్రియ తీరుపై డిప్యూటీ సీఎం ఆరా తీసి మనస్తాపానికి గురైనట్టు చెబుతున్నారు.
మంత్రి అయ్యాక స్తానికి నేత‌ల‌ను అస‌లు లెక్క‌చేయ‌డంలేదంట. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనమంటున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాకముందే అఖిలప్రియే సమావేశాన్ని ప్రారంభించేశారు. చైర్ పర్సన్ వచ్చే లోపు తాను మాట్లాడేసి… మిగిలిన వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా తనకు కర్నూలులో పని ఉందంటూ అఖిలప్రియ వెళ్లిపోయారు. మీరు మాట్లాడేసి వెళ్లిపోతే ఎలా… తాను చెప్పే సమస్యలను వినాలి కదా అంటూ చైర్ పర్సన్ – కౌన్సిలర్లు నిలదీశారు. అయితే అఖిలప్రియ మాత్రం లెక్క చేయలేదు.
చిన్న వ‌య‌సులో మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక ఆమెలో చాలా మార్పు వ‌చ్చిందంటున్నారు. పెద్ద‌లంటే గౌర‌వంలేక‌పోవ‌డం, ఆహంకారంగా వ్య‌వ‌హ‌రించ‌డం, స్తానికి నేత‌ల‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డం ఇలాంటి వ‌న్ని భ‌విష్య‌త్తులో ఒంట‌రి అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని నంద్యాల రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అమె దోర‌ణ‌ని చూసి భూమా అనుచ‌రులు కూడా ఆందోళ‌న చెందుతున్నారు. రాజ‌కీయంగా ఎంతో భ‌విష్య‌త్తు ఉంద‌ని అంటున్నారు. కాని అమె వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తే సీనియర్లను లెక్కచేయకపోవడం వల్ల భవిష్యత్తులో ఆమె ఒంటరయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చంద్ర‌బాబు వ్యూహానికి… శిల్పా,భూమా వ‌ర్గాలు మ‌టాషేనా..!
  2. ఉప ఎన్నికలకు ముందే.. అఖిల ప్రియకు చుక్కలు చూపిస్తున్నారు
  3. టీడీపీకీ భ‌విష్య‌త్తు ఆశా కిర‌ణం బ్రాహ్మ‌ణేనా..?
  4. అనుచ‌రుల ఒత్తిడితో ఎటూతేల్చుకోలేక పోతున్న భూమాఅఖిల ప్రియారెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -