Monday, April 29, 2024
- Advertisement -

అవతార్ 2 మూవీ.. ఎలా ఉందంటే ?

- Advertisement -

ప్రపంచంలో అవతార్ 2 మూవీ కోసం నడిచిన వెయిటింగ్ అంతా ఇంతా కాదు. ఉన్న ప్రతి సినీ అభిమాని కూడా కళ్ళు కాయలు కచేలా ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు. 2009 వచ్చిన అవతార్ మూవీ సృష్టించిన సంచలనాలు ఎలాంటివో మానందరికి తెలుసు.. ఆకట్టుకునే కథాంశం,. మూవీలో కట్టిపడేసే విజువల్స్, మనలను వేరే ప్రపంచానికి తీసుకెళ్లి సరికొత్త అనుభూతిని పంచింది అవతార్ మూవీ. అప్పట్లోనే ఆ మూవీ 18 వేల కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి వరల్డ్ టాప్ గ్రాసర్ మూవీస్ టాప్ టెన్ లలో ఇప్పటికీ కూడా ఆగ్రస్థానంలో ఉంది. ఇక అలాంటి విజువల్ ట్రీట్ వండర్ మూవీకి 13 ఏళ్ల తరువాత సిక్వల్ రూపొందించారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినీ అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ” అవతార్ 2 ” డిసెంబర్ 16 న ( నేడు ) రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో సార్ట్ అండ్ స్ట్రైట్ గా తెలుసుకుందాం!

మొదటి భాగం ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో రెండవ భాగం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మొదటి భాగంలో పండోరా గ్రహంలోని తెగతో కలిసిపోయిన జాక్ ( హీరో ) అదే తెగకు చెందిన నేతేరి ( హీరోయిన్ ) తో ప్రేమలో పడి వివాహం చేసుకుంటాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయి పుడుతుంది. ఇక మొదటి భాగంలో చనిపోయిన డాక్టర్ గ్రెస్ డి‌ఎన్‌ఏ ఆధారంగా ఓ అవతార్ ను సృష్టించి ఆ అమ్మాయికి కిరి అని పేరు పెడతారు. కిరి ని కూడా జాక్ నేతేరి దత్తత తీసుకొని పెంచుతారు. కాగా మొదటి బాగంలో పండోరా గ్రహంలోని తెగతో ఓడిపోయిన మానవులను తిరిగి భూమిపైకి పంపిస్తారు. నావి తెగవాసులు. ఒకరోజు రాత్రి మళ్ళీ మానవులు పండోరా గ్రహంపై దండెత్తుతారు. దాంతో అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించిన జాక్ కుటుంబం సముద్రవాసులు జీవించే మెట్కయన్ అనే గ్రామానికి వలస వెళతారు. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జాక్ మానవులను ఎలా ఎదుర్కొని జయించాడు అనేదే మిగిలిన కథాంశం.

విశ్లేషణ : మొదటి భాగం చూసిన వారికి పెద్దగా కథలో కొత్తదనం కనిపించకపోవచ్చు గాని, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి సరికొత్త సినీ ప్రియులను థ్రిల్ చేశాడనే చెప్పవచ్చు. మూవీలోని ప్రతి ఫ్రేమ్ కూడా మనకు వేరే ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా మూవీలో వాడిన మోషన్ క్యాప్చర్ త్రీడి టెక్నాలజీ మనకు సరికొత్త అనుభూతినే పంచుతుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు చూపించిన ప్రతిభ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళుతుంది. మొత్తానికి విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభతో మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

వారసుడు మూవీ కోసం రంగంలోకి పవర్ స్టార్ ?

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !

పుష్ప 2.. సుక్కు నయా ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -