Monday, April 29, 2024
- Advertisement -

తమిళనాడులో శ‌శిక‌ళ కీలక నిర్ణ‌యం!

- Advertisement -

అన్నాడిఎంకే బహిష్కృత నేత శశికళ కొన్నాళ్లు రాజకీయాలకు దూరమయ్యారు. జైలు నుంచి విడుదల అయ్యాక క్రీయాశీలకంగా వ్యవహరించలేదు. ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం, అది కాస్తా వైరల్ కావడంతో శశికళ రాజకీయ ఎంట్రీగా ఖాయంగా కనిపిస్తోంది.

మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌ మరణం తర్వాత పార్టీ తీవ్ర ఒడిదొడుకులకు గురైన విషయం తెలిసిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా శశికళ నియమితులయ్యారు. అయితే, 2017లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌లో శశికళతో పాటు ఆమె అల్లుడు దినకరన్‌ను ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

ఇదే అదునుగా భావించిన శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమౌతున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేస్తా.. అందరూ ధైర్యంగా ఉండండి. కరోనా వేవ్ తగ్గాక కచ్చితంగా వస్తానని, అనుచరులతో శశికళ చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు చిన్నమ్మకు అనుకూలిస్తాయా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఆనందయ్య మందుపై స్పందించిన చిన జీయర్ స్వామి

థ్రిల్లింగ్‌ కథతో చేయడానికి సిద్ధమైన చందమామ!

రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -