Monday, April 29, 2024
- Advertisement -

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం కేసీ ఆర్ నువ్వు రైతుల వైపు ఉన్నావా? లేక మోడీ వైపు ఉన్నావా? అంటూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప‌త్తి ధ‌ర‌ల‌తో పాటు మిర్చి ధ‌ర‌లు ప‌డిపోయాయ‌ని ప‌లు ప‌త్రిక‌లు ప్ర‌చురించాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ క‌థ‌నాలు గురించి ప్ర‌స్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీనిపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ… ‘నిజామాబాద్ జిల్లాలో శనగ రైతులు, పెద్దపల్లి జిల్లాలో పత్తి రైతులు చేసిన కష్టానికి ఫలితం కోసం రోడ్డెక్కారు. కేసీఆర్ సర్కారు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసింది. మద్ద‌తు ధరకు ప్రభుత్వ హామీ లేదు. దళారులపై పర్యవేక్షణ లేదు. నల్ల వ్యవసాయ చట్టాల అమలు ఫలితమే ఇది. కేసీఆర్.. నువ్వు మోదీ వైపా? రైతుల వైపా?’ అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

అలాగే, పార్లమెంట్ ను సీఎం కేసీఆర్ త‌ప్పుదోవ ప‌ట్టించార‌నే బీజేపీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ అంశంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌నే దానిపై రిట‌న్ కంప్లైంట్ ఇస్తాను.. చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ముందా? అంటూ బీజేపీకి స‌వాల్ విసిరారు. బండి సంజ‌య్‌, కేసీఆర్ లు ఇద్ద‌రు ఒక్క‌టేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -