ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధం

- Advertisement -

పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమైన వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది సర్కారు. PRC సహా ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు.

PRC నివేదిక.. DA బకాయిలు, CPS రద్దు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాల వంటి అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. బుధవారమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీసులు ఇచ్చాయి ఉద్యోగసంఘాలు.

- Advertisement -

డిసెంబరు 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. అటు పీఆర్సీపై ఉద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని మంత్రి బాలినేని సూచించారు. సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని, తప్పకుండా ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

ఢిల్లీ లో మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు

భారత్ లో కోవిడ్ త్రాడ్‌ వేవ్‌… కర్ణాటక లో ఇద్దరికి ఒమైక్రాన్..!

ఒమిక్రాన్ పై తెలంగాణ కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -