Saturday, April 27, 2024
- Advertisement -

ఏక్ష‌నంలో నైనా జ‌స్టిస్‌ క‌ణ్ణ‌న్ అరెస్ట్‌

- Advertisement -
Supreme Court sentences Justice Karnan to 6 months in jail for contempt of court

కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ కర్ణన్‌ వివాదం మరో మలుపు తిరిగింది. ఆయన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు, ధిక్కరణ నేరం కింద కర్ణన్‌కు ఆరునెలలు పాటు జైలుశిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఆయన్ని పోలీసులు ఏక్ష‌ణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

అంత‌కు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌, మరో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జస్టిస్‌ కర్ణన్‌ అయిదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఇంటినుంచే తీర్పును ఇచ్చి సంచ‌ల‌నం రేపారు. కర్ణన్ తీర్పుతో ఒక్కసారిగా న్యాయవ్యవస్ధ షాక్‌కు గురైంది.
అంత‌కు ముందు కుల వివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌-1989, 2015ల కింద వీళ్లకి శిక్షను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరునెలలు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. జరిమానాను వారం రోజుల్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చెల్లించాలని పేర్కొన్నారు. ఏడుగురితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కర్ణన్‌పై కోర్టు ధిక్కారణ అభియోగాలను విచారణ చేపట్టింది. ఆయన ఎలాంటి న్యాయ, పరిపాలన విధులు నిర్వర్తించకుండా జస్టిస్‌ ఖేహర్‌తో కలిసి జస్టిస్‌ భానుమతి ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

{loadmodule mod_custom,Side Ad 2}
త‌న తోటి హైకోర్టు న్యాయమూర్తుల్లో 20 మంది అవినీతి పరులున్నారంటూ జస్టిస్‌ కర్ణన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. ఆయనను హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. కర్ణన్ గైర్హాజరు కావడంతో ఆయన తీర్పులను ఎవరూ అమలు చేయాల్సిన అవసరంలేదని దేశంలోని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. దీంతో మార్చి 31న విచారణకు ఆయన హాజరయ్యారు.
విచార‌న స‌మ‌యంలో ఆయ‌న మాన‌సికంగా ఆరోగ్యంగా ఉన్నార‌నేది తెలుసుకొనేందుకు వైద్యపరీక్షలు చేయించాలని ఆదేశించింది న్యాయస్థానంపై తీవ్రంగా స్పందించారు క‌ర్ణ‌న్‌.తనకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన సుప్రీం న్యాయమూర్తులకే వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. మే 2న సుప్రీం జడ్జీలపై నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేసిన విషయం తెల్సిందే.ఇప్పుడు క‌ర్ణ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -