Monday, April 29, 2024
- Advertisement -

షాక్ ఇవ్వబోతున్న జియో!

- Advertisement -
reliance jio started charging

జియో ఇచ్చిన ఆఫర్ తో దేశ‌వ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా యూజ‌ర్లు ఈ ఆఫర్ ను వాడుకుంటున్నారు. దేశంలో ఈ జియోని వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇతర్ టెలికం కంపెనీలకు షాక్ ఇచ్చేలా ఈ జియో వెల్‌కం ఆఫ‌ర్‌ను పొడించారు ముఖేష్ అంబానీ.

ముందుగా డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఇచ్చిన ఈ ఆఫ‌ర్ కాల‌ప‌రిమితిని త‌ర్వాత మార్చి 31 ఆ త‌ర్వాత మే 31 వ‌ర‌కు పొడిగించారు. ఇక యూజ‌ర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవ‌డంతో జియో ఉచిత ఆఫర్‌పై ప‌రిమితిని వేధించ‌నుంది. ఈ క్ర‌మంలోనే కొత్త ఏడాది జ‌న‌వ‌రి నుంచి జియో మ‌రో ఆఫ‌ర్‌ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు లీకులు వ‌దిలింది. ఇకపై జియో వాడే వారు రోజుకి 1జీబీ 4జీ డేటా ఫ్రీగా పొందుతారు. ఆ తర్వాత కూడా డేటా కావలంటే.. 51 రూపాయ‌ల‌తో రీ చార్జ్ చేసుకోవాలి.

1జీబీ 4జీ ఉచిత డేటా త‌ర్వాత 51 రూపాయ‌లు క‌డితేనే ఆ రోజుకు డేటా అందుబాటులోకి వ‌స్తుంది. ఈ ఆఫర్ కూడా ఓకే అని ప్రస్తుతానికి వినియోగ‌దారులు అనుకున్నా.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా జియో త‌న యూజ‌ర్ల‌ను రీచార్జ్ వైపున‌కు మ‌ళ్లీస్తోన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక్కసారి డబ్బులు కట్టడం మొదలు పెడితే.. యూజ‌ర్స్ డబ్బు కడుతునే ఉండాలి.

Related

  1. రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్!
  2. జియోకి షాక్ ఇచ్చిన కేంద్రం!
  3. BSNL ఆఫర్ తో జియో కి దిమ్మతిరిగింది!
  4. అబ్బో జియో దెబ్బ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -