పార్లమెంట్‌లో కేంద్రం సంచలన నిర్ణయం

- Advertisement -

నూతన వ్యవసాయ చట్టాల బిల్లును పార్లమెంట్ రద్దు చేసింది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. రైతులకు అనుకూలంగా ఉంటుందని నూతన వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడంతో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి.

ఈ చట్టం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఉత్తరాది రాష్ట్ర రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో పోలీసులకు రైతు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రైతులపై లాఠీలు జులిపించారు. పోలీసుల కాల్పుల్లో అనేక మంది రైతులు మృతి చెందారు.

- Advertisement -

వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు తాము వెనక్కు తగ్గేది లేదని, వేలాది మంది రైతులు ఢిల్లీ-పంజాబ్ సరిహాద్దులో నిరసనకు దిగారు. దీంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సుప్రీంకోర్టు సైతం రైతులపై అసహనం వ్యక్తం చేసింది. మీరు ధర్నాలు చేస్తుంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది వాటిల్లుతుందని, ఆంబులేన్సులకు సైతం దారివ్వడంలేదని, రైతులు వారి వారి గమ్యస్తానాలకు వెళ్లాలని సూచించింది.

ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. రైతులను ఇబ్బందిపెట్టే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని చెప్పినట్లుగానే ఇవాళ ఉభయ సభల్లో బిల్లుపై చర్చించి మూజువాని ఓటు ద్వారా వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. రానున్న ఎన్నికల కోసమే ప్రభుత్వం దిగొస్తుందని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.

పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన

కేసీఆర్ పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి

మరో ముప్పు ముంచుకొస్తుంది

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -