Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీకి షాక్‌.. రాజీనామా చేసిన‌ దంప‌తులు

- Advertisement -

ప్ర‌తిప‌క్ష టీడీపీలో విభేదాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క నేత, ఆమె భ‌ర్త పార్టీకి రాజీనామా చేశారు. చిన‌రాజ‌ప్పతో పాటు మ‌రికొంత మంది నాయకుల‌తో త‌మ‌కు ఇబ్బందులు ఉన్నాయ‌ని, అందుకే తీవ్ర మ‌న‌స్తాపంతో పార్టీలో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నామ‌ని తెలిపారు. కాకినాడ‌రూర‌ల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత ల‌క్ష్మి, ఆమె భ‌ర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి శుక్ర‌వారం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవికి తాను, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి త‌న భ‌ర్త‌ రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన పిల్లి అనంత‌ల‌క్ష్మి విలేక‌రుల ఎదుట క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. రాజీనామా చేసినా పార్టీతో అనుబంధం ఉంటుంద‌ని, అయితే కొంత మంది వ్య‌క్తుల కార‌ణంగా ఈ నిర్న‌యం తీసుకోక త‌ప్ప‌లేద‌ని ఆవేద‌న చెందారు. కాగా ఇప్ప‌టికే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే అత్య‌ధికంగా ఏక‌గ్రీవాలు, అందునా అధికార వైఎస్సార్ సీపీ మ‌ద్ద‌తుదారులు స్థానిక పీఠాలు ద‌క్కించుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

తొలి విడ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఈ మేర‌కు ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మిగ‌తా జిల్లాల్లోనూ ఇంచుమించు ఇదే ప‌రిస్థితి ఉంది. గ్రామ స్థాయి నేత‌లు చాలా మంది టీడీపీని వీడి, వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇలాంటి త‌రుణంలో మాజీ ఎమ్మెల్యే కుటుంబం చిన‌రాజ‌ప్ప‌తో ఇబ్బందుల కార‌ణంగా పార్టీని వీడ‌టం చూస్తుంటే అగ్ర శ్రేణి నాయ‌కుల‌ మ‌ధ్య విభేదాలు పొడ‌చూప‌డం టీడీపీకి మ‌రో మైన‌స్‌గా మారింది.

ఓటుకు 5 వేలు.. సరిపోవంటే 10 వేలు తీసుకోండి!

సెక్స్ వర్కర్‌గా శ్వేతబసు ప్రసాద్.. !

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన జబర్ధస్త్ కమెడియన్..!

చంద్ర‌బాబు కుట్ర‌.. చెంప చెళ్లుమందిగా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -